బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు

మద్దూర్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం ప్రాజెక్టు పై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికకు చట్టభద్ధత లేదని హై కోర్ట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్ట్ ఇచ్చిన తీర్పు మేరకు కొత్తపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు.
బాణా సంచా, తపాకాయలు కాల్చుతూ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శోభమ్మా దంపతుల పెళ్లి రోజు సందర్బంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మల్లేష్, రాం రెడ్డి, శివ రెడ్డి, అల్లీ రాజు,వెంకటేష్, జగ్గప్ప,సుల్తాన్,కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
