పిడుగుపాటుకు పాడి పశువు మృతి….
వెల్దండ, ఆంధ్రప్రభ: వెల్దండ మండల సమీపంలోని గుండాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంలో పిడుగుపాటుకు గ్రామానికి చెందిన రైతురాలు వావిళ్ల చిట్టెమ్మకు చెందిన పాడి పశువు మృతి చెందింది.
రోజుకు సుమారు 10 లీటర్ల పాలను ఇస్తున్న ఆవు మృతి చెందడంతో తమ కుటుంబ జీవనోపాధి దెబ్బతిన్నట్లు రైతురాలు చిట్టెమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆమె వేడుకున్నారు.
