కనకదుర్గమ్మకు లక్ష్మి కాసుల హారం…

కనకదుర్గమ్మకు లక్ష్మి కాసుల హారం…

107.500 గ్రాముల లక్ష్మీ కాసుల హారం సమర్పణ
పచ్చలు, ఎరుపు రాళ్లతో ప్రత్యేక అలంకారం
రూ.16.70 లక్షల విలువైన ఆభరణం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం నిజామాబాద్ జిల్లా ద్వారకా నగర్‌కు చెందిన భక్తుడు తోడుపునూరి శ్రీనివాస్, కనకదుర్గమ్మపై ఉన్న అచంచల భక్తితో విలువైన బంగారు ఆభరణాన్ని సమర్పించారు. అమ్మవారికి సమర్పించిన ఈ లక్ష్మీ కాసుల హారం మొత్తం 107.500 గ్రాముల బరువుతో ఉండగా, పచ్చలు, ఎరుపు రాళ్లు (కెంపులు) పొదిగిన ఆకర్షణీయ రూపంతో ప్రత్యేకత సంతరించుకుంది.

ఆలయ అధికారులు భక్తుడి విరాళాన్ని స్వీకరించి, ఆలయ సంప్రదాయాల ప్రకారం నమోదు చేశారు. ప్రస్తుత బంగారం మార్కెట్ ధరల ప్రకారం ఈ ఆభరణం విలువ సుమారు రూ.16.30 లక్షల నుంచి రూ.16.70 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. దాతకు అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.

Leave a Reply