Vijayawada సీఎం సహాయనిధి నుంచి ఎల్‌ఓసీ అందజేత
Vijayawada సీఎం సహాయనిధి నుంచి ఎల్‌ఓసీ అందజేత
భవానిపురం (Vijayawada), ఆంధ్రప్రభ : హృద్రోగంతో బాధపడుతున్న ఓ మహిళకు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్‌ఓసీని శుక్రవారం ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు. 45వ డివిజన్‌కు చెందిన సితార సెంటర్ నివాసి సంగం వరలక్ష్మీ (54) హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు శస్త్రచికిత్స అవసరమని సూచించడంతో కుటుంబ సభ్యులు వైద్య సాయం కోసం ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో రూ.4 లక్షల 22 వేల విలువైన ఎల్‌ఓసీ మంజూరైంది. శుక్రవారం ఎన్డీఏ కార్యాలయంలో 45వ డివిజన్ జనసేన అధ్యక్షుడు బొమ్ము గోవిందు ఆ ఎల్‌ఓసీని బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి ఆర్థిక సహాయం అందించడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.
