గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని శాంతినికేతన్ హై స్కూల్ లో కరస్పాండెంట్ మియాపురం హరీష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. గ్రాడ్యుయేషన్ గౌన్లు ధరించిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.

ముఖ్య అతిథులుగా టేకుమట్ల ఎస్సై అమూల్య, సర్పంచ్ గునిగంటి రజిని మహేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న తరగతులకు గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను, నృత్యాలను ప్రశంసించారు. చిన్నారులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply