కొలనుపాకలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు ఘన స్వాగతం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామం నుంచి సిద్ధులగుట్టలోని సిద్ధేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సోమవారం వెళ్తున్న ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో కొద్దిసేపు ఆగిన ఆయన స్థానిక ప్రజలు, పార్టీ నాయకులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, మాజీ ఎంపీటీసీ ఆరె ప్రశాంత్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ బండ వీరమల్లయ్య, అస్లం సయ్యద్‌తో పాటు పలువురు గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.