శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బూదగవిలోని సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. అర్చకులు ప్రకాష్ స్వామి ఆధ్వర్యంలో సుప్రభాత సేవలో భాగంగా తెల్లవారుజామున మూలవిరాట్ కు అభిషేకం, వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజ కార్యక్రమాలు, మహామంగళ హారతి కార్యక్రమాలను నిర్వహించారు.

శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు బసవరాజు స్వామి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీ సూర్య నారాయణస్వామిని బళ్లారి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన పేరిట ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రకాష్ స్వామి, బసవరాజు స్వామిలు స్వామివారి విశిష్టతను వివరించారు. మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డిని సన్మానించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చత్రగుడి చిరంజీవి, కమిటీ సభ్యులు మహేంద్ర గౌడ్, సభ్యులు చత్రగుడి సుధాకర్, నాగభూషణ్ స్వామి, వీరేష్ స్వామి, నాగేంద్ర, చక్రి, గాదిలింగ తదితరులు పాల్గొన్నారు.
