స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి

స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ రాయంపల్లి రేగాటి నాగరాజు, ఆలయ ఈవో సాకే రమేష్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం స్వామివారి ఆలయంలో సుప్రభాత సేవలో భాగంగా తెల్లవారుజామున స్వామి వారి మూలవిరాట్ కు అభిషేకం, పుష్పాలతో, ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరణ, అర్చనలు, పూజ కార్యక్రమాలను, మహా మంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్క రించుకొని, బ్రహ్మోత్సవాల గోడపత్రికలను, కరపత్రాలను స్వామివారి వద్ద పెట్టి, ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకనాథ్ చార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, ఆలయ ఈవో సాకే రమేష్ బాబులు మాట్లాడుతూ 28వ తేదీన స్వామివారి ఉత్సవ మూర్తులు ఆమిద్యాల నుండి స్వామివారి ఆలయానికి చేరుతాయి.

29వ తేదీన ధ్వజారోహణం, ప్రాకారోత్సవం, 30వ తేదీన సింహ వాహనోత్సవం, చంద్రప్రభ వాహనోత్సవం, మే 1వ తేదీన గోవాహనోత్సవం, శేష వాహనోత్సవం, 2వ తేదీన హంస వాహనోత్సవం, 3వ తేదీన హనుమంత వాహనోత్సవం, 4వ తేదీన గరుడ వాహనోత్సవం, స్వామి వారి కల్యాణోత్సవం, 5వ తేదీన సూర్యప్రభ వాహనోత్సవం, ఐరావత వాహనోత్సవం, 6వ తేదీన ఉదయం మడుగు తేరు, బ్రహ్మరథోత్సవం, 7వ తేదీన అశ్వ వాహనం, 8వ తేదీన ధ్వజఅవరోహణం, శయనోత్సవం, 9వ తేదీన స్వామివారి ఉత్సవమూర్తు లను ఆమిద్యాలలోని పెన్నా ఓబులేసు ఆలయానికి చేరుతాయని తెలిపారు.

అనంతరం బ్రహ్మోత్సవాల గోడపత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొల్లినేని పద్మాక్షి, దబ్బర మాధవి, బోయ రాములమ్మ, కురుబ ఇందిరమ్మ, చావలి భాయి, మీనుగ రామకృష్ణ, ధనుంజయ ఆచారి, చంద్రమౌళి స్వామి, చిన్న నారాయణ, ఉరవకొండ సింగల్ విండో అధ్యక్షులు ప్యారం కేశవానంద, ఆస్పత్రి కమిటీ చైర్మన్ కండక్టర్ తిమ్మప్ప, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాంప్రసాద్, జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాలు దేవిక దేవి, మాజీ ఎంపీపీ సుంకరత్నమ్మ, మాజీ సర్పంచులు మోపిడి గోవిందు, ఇంద్రావతి వెంకటేశులు, అర్చకులు మయూరం బాలాజీ చార్యులు, గుండురావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply