పెన్నా హోబిలం ఆలయ హుండీ లెక్కింపు

పెన్నా హోబిలం ఆలయ హుండీ లెక్కింపు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నా హోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణలో, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రాయంపల్లి రేగటి నాగరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు బొల్లినేని పద్మాక్షి, మీనుగ రామకృష్ణ, ధనుంజయ ఆచారి, అమల్లదిన్నె చంద్రమౌళి, మంగళ చిన్న నారాయణప్ప సమక్షంలో హుండీలను తెరిచి లెక్కించినట్లు ఆలయ ఈవో సాకే రమేష్ బాబు తెలిపారు.

హుండీలను తెరిచి లెక్కించగా 36 రోజులకు గాను 25,96,507 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు హనుమాన్ సేవా సంస్థ సభ్యులు, అనంతపురంలోని భవాని సేవా సమితి సభ్యులు, టిడిపి నాయకులు మోపిడి గోవిందు, ఇంద్రావతి సుధాకర్, ఓబులేసు, కురుబ ఎర్రిస్వామి, మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply