అంగన్వాడీలకు మొబైల్ ఫోన్లు పంపిణీ..

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఎప్పుడు చూసినా మహిళల సంక్షేమం గురించే సీఎం మాట్లాడతారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడి సూపర్వైజర్లకు అంగన్వాడీ టీచర్లకు మంజూరైన 159మొబైల్ ఫోన్ల ను ఉట్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఉమాదేవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ద్వారా ఇచ్చిన మొబైల్ ఫోన్లను వ్యక్తిగత0 వాడుకోకుండా శాఖ పరమైన ప్రభుత్వ కార్యక్రమాలకు కేంద్రాల పనితీరు గురించి వాడుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతపై దృష్టి సారించాలని మహిళలకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ వారి సంక్షేమం కోసం వడ్డీ లేని రుణాలు బ్యాంకు రుణాలు పెట్రోల్ బంకులు బస్సులు ప్రభుత్వపరంగా మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.

శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆదివాసి మహిళ సీతక్క పై బి ఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తూ ఆదివాసి మహిళ మంత్రి సీతక్క పై అసత్య ప్రచారం చేయడం ఖండిస్తున్నా మని అన్నారు ఇలాంటి ప్రచారం చేస్తే సహించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. టిఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వ ఆయంలో అనేక అవినీతి ఆక్రమాలు జరిగిన విషయం తెలుసునని గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం గురించి ప్రజలకు తెలుసునని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజస్థాన్,ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అంగన్వాడి టీచర్లకు తీసుకున్న మొబైల్ ఫోన్లో కొనుగోలు ధరల కంటే తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి సీతక్క తక్కువ ధరలకు మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొండంత అభివృద్ధి జరిగితే గోరంత ప్రచారం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాలయంలో గోరంత అభివృద్ధి జరిగితే కొండంత ప్రచారం జరిగిందని అన్నారు.

ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తేవాలని అంగన్వాడి కేంద్రాలు అంగన్వాడి కేంద్రాలకు మంచినీటి వసతి సౌకర్యం కల్పిస్తున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలోఉట్నూర్ సిడిపిఓ ఉమాదేవి, ఆదిలాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఏక్బాల్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉత్తముకాడే, కాంగ్రెస్ నాయకులు రాజేష్ జాదవ్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు మంజులత,పద్మ, నిర్మల, విజయ, చిత్రకళ, లక్ష్మి, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.