రమణారెడ్డిని సన్మానించిన పీసీసీ అధికార ప్రతినిధి జిన్నారెడ్డి

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ ; సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణానికి చెందిన న్యాయవాది రెడ్డిమళ్ళ రమణారెడ్డిని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జిన్నారెడ్డి శ్రీనివాస రెడ్డి ఘనంగా సన్మానించారు. రమణారెడ్డి ఇటీవల జరిగిన హుజూర్ నగర్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధికార ప్రతినిధిగా ఎన్నికైన సందర్భంగా శనివారం ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి పూలమాలలతో, పట్టు శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా జన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, హైకోర్టు న్యాయవాదిగా హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ కి తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానన్నారు. హుజూర్ నాగర్ బార్ అసోసియేషన్ కి 55 ఇంచుల ఎల్ఈడి కలర్ టీవీని అందజేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో నేరేడుచర్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లంశెట్ల రమేష్ బాబు,మాజీ కౌన్సిలర్ కుంకు శ్రీనివాసరావు, రబ్బాని, బ్యాంక్ సైదులు, ధీరావత్ శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply