33వ వార్డులో ‘ప్రజాపాలన’ వార్డు సభ..

బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ 33వ వార్డులో కౌన్సిలర్ పోలు ఉమాదేవి-శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ రెండో విడత వార్డు సభ నిర్వహించారు. ఈ సభలో ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల మంజూరుతో పాటు వార్డులోని తాగునీరు, విద్యుత్ సమస్యలు, సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు. యువత గంజాయి, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. ఇదే వేదికపై ఏఎన్‌ఎం, అంగన్‌వాడీల ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. చిన్నపిల్లలకు, బాలింతలకు టీకాలు, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.