మండల ఉపసర్పంచ్ల సంఘం కార్యవర్గం ఎన్నిక

మండల ఉపసర్పంచ్ల సంఘం కార్యవర్గం ఎన్నిక

బాసర, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలో బుధవారం మండల ఉప సర్పంచుల సంఘ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల ఉప సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా సయ్యద్ అలీ ( బాసర ఉప సర్పంచ్), ఉపాధ్యక్షుడు వాఘ్మారే విజయ్ (దొడపూర్), కోశాధికారి గా పసుపోల్ల పురుషోత్తం (ఓని), సెక్రటరీ గా తంగానే సునీల్ (బీదరెల్లి), జనరల్ సెక్రటరీ గా నాగనాథ్ కోపెలే ( కిర్గుల్ (కె) ) , సభ్యులు గా మేశెట్టి పద్మిని బాయి (టాక్లి ), నర్వాడే మంజూష (సాలాపూర్ ), దత్తహరి పాటిల్ శిందే (లాబ్ది), ఇబిత్ కర్ నర్సుబాయి (కౌట ), సాదోల్ల చిన్న సాయిలు, ( కిర్గుల్ (బి)) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రజలు నమ్మి గెలిపించినందుకు ప్రజల సేవ చేసుకుంటామని ఈ సందర్భంగా ఉప సర్పంచ్ బాసర మండల సంఘం అధ్యక్షుడు సయ్యద్ అలీ అన్నారు.