పాలకమండలి సభ్యునిగా ప్రియదర్శిని నవీన్ బాబు….

పాలకమండలి సభ్యునిగా ప్రియదర్శిని నవీన్ బాబు….

  • జేఎన్టీయూహెచ్ చరిత్రలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాకు దక్కిన అరుదైన అవకాశం.

ఖ‌మ్మం, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల నిర్వహణ క్షేత్రం ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా ఖమ్మంలోని ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు ఎంపికయ్యారు. ఈ మేరకు జేఎన్టీయూహెచ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూహెచ్ చరిత్రలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాకు ఈ అరుదైన అవకాశం లభించింది.

అమెరికాలో విదేశీ ఉద్యోగ అవకాశాలను వదులుకొని, మన దేశంలోని ప్రతిష్టాత్మక ఎంఎన్సీ కంపెనీ ఉద్యోగాన్ని కాదని తాను పుట్టిన గడ్డకు అత్యుత్తమ విద్యా అవకాశాలను అందించాలనే ద్రృడ దీక్షతో , ఉక్కు సంకల్పంతో ప్రియదర్శిని విద్యాసంస్థలను నెలకొల్పి విద్యార్థులను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దుతున్నారు. గత 15 సంవత్సరాల క్రితం ఖమ్మంలో ప్రత్యేకంగా విద్యార్థీనిల కోసం ఇంజనీరింగ్ కళాశాలను వ్యవస్థీకరించి విద్యార్థినిల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఉన్నత స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.

ప్రియదర్శని మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ఒక అత్యుత్తమ విద్యా క్షేత్రంగా, చదువుల దేవాలయంగా తీర్చిదిద్ది విద్యార్థినీలకు సకల నైపుణ్యాలను అందించడానికి నవీన్ బాబు అహర్నిశలు ఉక్కు సంకల్పంతో కృషి చేస్తున్నారు. అమ్మాయిలకు దేశ విదేశాలలో ఉన్న అవకాశాలను , నైపుణ్యాలను అందిస్తూ దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలతో కలిసి విద్యార్థినీల్లో సాంకేతిక నైపుణ్యాలను అందించి రాష్ట్రంలోనే ఒక దీటైన సాంకేతిక విద్యా విధానాన్ని అమలు చేసి ప్రపంచంతో విద్యార్థినీలు పోటీపడేలా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

ప్రపంచంలోని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్ తదితర దేశాలలో, మనదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న అంతర్జాతీయ ఎమ్ ఎన్ సి కంపెనీలలో విద్యార్థినీలు అత్యున్నత ఉద్యోగ అవకాశాలను పొంది ఆర్థిక శక్తిగా మహిళా శక్తిని నిరూపించుకుని కళాశాల ఖ్యాతిని విద్యార్థినీలు దశ దిశలా చాటి చెప్తున్నారు. అమ్మాయిల కళాశాలను క్రమశిక్షణతో, అంకితభావంతో నిర్వహిస్తూ ప్రపంచంతో పోటీపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్పుతూ ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజం పట్ల వాత్సల్యాన్ని పెంచుతూ ఉక్కు క్రమశిక్షణతో ఇంజనీరింగ్ విద్యా క్షేత్రాన్ని పటిష్టంగా ఆదర్శప్రాయంగా నిర్వహిస్తున్నందుకుగాను డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబును జేఎన్టీయూహెచ్ పాలకమండలి సభ్యునిగా ఎంపిక చేశారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జేఎన్టీయూహెచ్ పాలకమండలి సభ్యునిగా ఎంపికైన ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు అపార విద్యా సేవలు అందిస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Leave a Reply