టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా ఎమ్మెల్యే తాతయ్య..

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా ఎమ్మెల్యే తాతయ్య..
తాతయ్యకు పట్టణంలో అపూర్వ స్వాగతం..
భారీ బైక్ ర్యాలీ..
కార్యకర్తలలో, నాయకులలో, అభిమానులలో, ఆనందోత్సవాలు…
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా నియమితులైన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య కు పట్టణంలో అపూర్వ స్వాగతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పలికారు. చిల్లకల్లు రోడ్డు నుండి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ కార్లతో ఎమ్మెల్యే తాతయ్య వాహనానికి ఎదురు వెళ్లి ఎమ్మెల్యే తాతని కలిసి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు మున్సిపల్ కౌన్సిలర్లు శుభాకాంక్షలు తెలియజేశారు.
బాణాసంచా కాలుస్తూ ఆనందోత్సవాలను వ్యక్తం చేస్తూ ర్యాలీగా ఎమ్మెల్యే తాతయ్యను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఓపెన్ టాప్ కారులో ఎమ్మెల్యే తాతయ్య నిలుచొని ప్రజలకు అభివందనం చేస్తూ ముందుకు సాగారు. ఎన్టీఆర్ సర్కిల్లో కార్యకర్తలు అభిమానులు తమ భుజాలపై ఎమ్మెల్యే తాతయ్యను ఎత్తుకొని ఎన్టీఆర్ విగ్రహం వరకు తీసుకుని వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే తాతయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పట్టణంలో పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే తాతయ్యకు పూలదండలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరోసభ్యునిగా నియమించినందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రి లోకేష్ కు, ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని, జిల్లా కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, టీడీపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు తొండపు దశరథ జనార్ధన్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ర్యాలీలో టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
