యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా సుధాకర్ గౌడ్.

బిక్కనూరు, ఆంధ్రప్రభ ; తెలంగాణ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా సుధాకర్ గౌడ్ నియమితులయ్యారు. ఈమెరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి ఉత్తర్వులు జారీ చేశారు మండల పరిధిలోగల సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ గా కొనసాగుతున్న సుధాకర్ గౌడ్ ను నియమించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా నియమించారు. సౌత్ క్యాంపస్లో ఆయన జియో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ గా కొనసాగుతూ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన నియామకం పట్ల సౌత్ క్యాంపస్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు
