జీడిమడ్ల రాములు మృతికి నివాళి

జీడిమడ్ల రాములు మృతికి నివాళి
మునుగోడు, ఆంధ్రప్రభ:
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన జీడిమడ్ల రాములు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్ మారగోని యాదమ్మ అంజయ్య గౌడ్ గురువారం మృతుడి నివాసానికి వెళ్లి, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదగోని గణేష్, అనంత చంద్రు, జీడిమెట్ల శ్రీను, జీడిమడ్ల శివకుమార్, పాలకూరి వెంకట్ గౌడ్ మరియు స్థానికులు పాల్గొన్నారు.
