దమ్మపేటలో పేకాటపై పోలీసుల మెరుపుదాడి..
దమ్మపేట, ఆంధ్రప్రభ: దమ్మపేట మండల పరిధిలోని పెద్ద గొల్లగూడెం గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు మంగళవారం మెరుపుదాడి నిర్వహించారు.
దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, పెద్ద గొల్లగూడెం గ్రామ శివారులో ఉన్న స్మశాన వాటిక సమీపంలో కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.12,400 నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
మరో ఇద్దరు వ్యక్తులు ఘటన స్థలం నుండి పరారైనట్లు ఎస్సై తెలిపారు. పరారీలో ఉన్న వారిని గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై సాయి కిషోర్ రెడ్డి వెల్లడించారు.
