Ntr – Rukmini | త్యాగానికి ఫలితం దక్కేనా..?

Ntr – Rukmini | త్యాగానికి ఫలితం దక్కేనా..?

Ntr – Rukmini | టాలీవుడ్‌లో రుక్మిణి వసంత్ క్రేజ్ పెరుగుతోంది
ఎన్టీఆర్ మూవీ కోసం కీలక నిర్ణయం
ధనుష్ ప్రాజెక్ట్ వదులుకున్న హీరోయిన్
త్యాగానికి తగ్గ ఫలితం దక్కుతుందా?

Ntr – Rukmini | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్.. శాండిల్ వుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఏకంగా ఈ అమ్మడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నటించే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకుంది. అయితే.. ఈ కన్నడ భామ.. ఎన్టీఆర్ మూవీ కోసం త్యాగం చేసిందనే వార్త బయటకు వచ్చింది. ఇంతకీ.. రుక్మిణి ఎన్టీఆర్ మూవీ కోసం ఏం త్యాగం చేసింది..? ఆ త్యాగానికి తగ్గ ఫలితం వచ్చేనా..?

Ntr – Rukmini | కెరీర్ టర్నింగ్ పాయింట్..

Ntr - Rukmini

సప్తసాగరాలు దాటి అనే చిన్న సినిమాతో కన్నడ భామ రుక్మిణి వసంత్ ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ చిత్రంలో ఆమె గ్లామర్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా, తన సహజమైన అందం, మృదువైన అభినయంతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే.. ఆ సినిమా తర్వాత ఆమెకు మంచి గుర్తింపు మాత్రమే కాదు, విభిన్న భాషల్లో నటించే ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం సౌత్‌లో వేగంగా ఎదుగుతున్న స్టార్ హీరోయిన్లలో రుక్మిణి ఒకరు అని చెప్పచ్చు. ఇప్పుడామె కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా భావిస్తున్న సినిమా తెలుగులో తెరకెక్కుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ మూవీ లో ఆమె కథానాయికగా నటిస్తోంది.

Ntr – Rukmini | ధనుష్ ప్రాజెక్ట్ వదులకుందా..

Ntr - Rukmini

ఈ సినిమా నేపథ్యంలో రుక్మిణి మరో కీలక అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందట. తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న కొత్త చిత్రానికి తమిళరసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ముందుగా రుక్మిణినే హీరోయిన్‌గా ఎంపిక చేశారట. అయితే.. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కోసం ధనుష్ ప్రాజెక్ట్‌ను వదులుకుందట. ఆమె స్థానంలో ఇప్పుడు ధురంధర్ భామ సారా అర్జున్‌ను తీసుకుంటున్నారని సమాచారం. బాలనటిగా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సారా, ఈ సినిమాతో కథానాయికగా కొత్త దశను ప్రారంభించబోతోంది. తెలుగులో ఆమె ఇప్పటికే యుఫోరియా చిత్రంలో నటించింది.

Ntr – Rukmini | త్యాగానికి తగ్గ ఫలితం..

Ntr - Rukmini

ఇలా రుక్మిణి.. ఎన్టీఆర్ మూవీలో నటించాలని ధనుష్ ప్రాజెక్ట్ వదులుకుందనే వార్త వైరల్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందట. పైగా పాన్ ఇండియా మూవీ.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో కావడంతో ఈ సినిమానే చేయాలని ఫిక్స్ అయ్యిందట. ఈ క్రేజీ మూవీ ముందుగా జనవరిలో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆతర్వాత జూన్ 25న రిలీజ్ అని ప్రకటించారు. అయితే.. జూన్ 25న కూడా రావడం లేదు. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ మూవీ కోసం రుక్మిణి చాలా డేట్స్ కేటాయించింది. మరి.. ఈ అమ్మడి త్యాగానికి తగ్గ ఫలితం వస్తుందేమో చూడాలి.

Ntr - Rukmini

Leave a Reply