BJP MP | కాంగ్రెస్ నిర్ణయాల వల్లే ఇప్పటికీ విభేదాలు…

BJP MP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లోక్‌సభలో డీలిమిటేషన్ అంశంపై జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఏపీ విభజనపై ఆయన చేసిన పోలికలు వివాదానికి దారితీశాయి.
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై లోక్‌సభలో జరిగిన చర్చ రాజకీయ వేడిని రాజేసింది. ఈ సందర్భంగా బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన అత్యంత అశాస్త్రీయంగా, దారుణంగా ఉందని ఆరోపించారు. ఆ ప్రక్రియ బ్రిటిష్ పాలకుల ‘విభజించు-పాలించు’ విధానాన్ని మించిపోయిందని వ్యాఖ్యానించారు.
ఇంకా ముందుకు వెళ్లి, ఏపీ విభజనను భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తప్పుదారి పట్టించిన నిర్ణయాల వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్లు, నిధుల అంశాల్లో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
అలాగే డీలిమిటేషన్ ప్రక్రియను రాజకీయ లాభాల కోసం ఉపయోగించుకోవద్దని హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఆయన విమర్శలు చేశారు.
