ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

మంత్రాలయం, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వస్తున్న భక్తులతో ప్రయాణిస్తున్న బొలెరో గూడ్స్ వాహనం ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు, ఒక మూడేళ్ల బాలిక, డ్రైవర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా కర్ణాటక రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.

ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే మంత్రాలయం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్‌ఐ మల్లికార్జున, సీఐ దస్తగిరి బాబు ఆధ్వర్యంలో పోలీసులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

Leave a Reply