127 kgs | బంగారం స్మగ్లింగ్ కేసులో…

127 kgs | బంగారం స్మగ్లింగ్ కేసులో…
127 kgs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె బెంగళూరులోని జైలు నుంచి విడుదలయ్యారు.
పరప్పణ అగ్రహారం జైలులో రిమాండ్‌లో ఉన్న రన్యా రావుకు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె విడుదలైనట్లు అధికారులు తెలిపారు.
విదేశాల నుంచి ఒక ఏడాదిలో 127 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ఏడాది కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది.
