Women reservation bill | వికసిత్ భారత్లో మహిళల పాత్ర

Women reservation bill | వికసిత్ భారత్లో మహిళల పాత్ర
Women reservation bill | డీలిమిటేషన్ చరిత్ర మరియు ప్రాధాన్యం
నారీ శక్తి వందన చట్టం: మహిళా సాధికారతకు బాట
నియోజకవర్గాల పెంపు: అవసరం మరియు ప్రభావం
పునర్విభజనపై రాజకీయ విభేదాలు
దక్షిణ-ఉత్తర రాష్ట్రాల మధ్య సమతుల్యత చర్చ
Women reservation bill | భారతదేశంలో రాష్ట్రాలలోని లోక్సభ, శాసనసభ సభ్యుల సంఖ్య అక్కడి జనాభా ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది. దాని ప్రకారం స్వాతంత్య్రానంతరం మొదటి లోక్సభ ఏర్పడే సమయంలో, గరిష్టంగా లోక్ సభ సభ్యుల సంఖ్య 500గా నిర్ణయించబడింది. తరువాత 1971 జనాభా లెక్కల ఆధారంగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జే.ఎల్. కపూర్ ఆధ్వర్యంలోని భారత డీలిమిటేషన్ కమిషన్ 1972 సిఫారసు అనుసరించి లోక్సభ స్థానాలను 543కి, మొత్తం శాసన సభ స్థానాలను 3771 నుంచి 3997కి పెంచారు.
మొదట్లో ప్రతి దశాబ్దానికి సంబంధించిన జనాభా లెక్కల ఆధారంగా సభ్యుల సంఖ్యను నిర్ణయించేవారు. అయితే రాష్ట్రాల కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు లోక్సభలో వాటి రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేయకుండా ఉండేందుకు, కేంద్ర ప్రభుత్వం 1976లో 2001 జనాభా లెక్కల వరకు నియోజకవర్గాల పునర్విభజనను నిలిపివేసింది. ఇందువలన నియోజకవర్గాల పరిమాణంలో భారీ వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. అతిపెద్ద నియోజకవర్గంలో ముప్పై లక్షలకు పైగా ఓటర్లు ఉండగా, అతి చిన్న నియోజకవర్గంలో 50,000 కంటే తక్కువ మంది ఉన్నారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా 1973లో షుమారు 60 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహించిన అదే 543 పార్లమెంటు నియోజకవర్గాలు ప్రస్తుతం 147 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

దేశం దిశను మార్చే బిల్లులు.. దేశంలో నియోజకవర్గాల పునర్విభజన కోసం 2002లో ఏర్పాటైన కమిషన్ నివేదిక అనుసరించి 2008లో పార్లమెంటు, శాసన సభ నియోజకవర్గాల హద్దులు మార్చారు తప్పితే నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి 2023 సెప్టెంబరులో ఆమోదించిన “నారీ శక్తి వందన అధినియమ్” బిల్ ప్రకారం 33శాతం మహిళా రిజర్వేషన్ 2034 నుండి మాత్రమే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ 2029 నుండే మహిళా రిజర్వేషన్ మరియు నియోజకవర్గాల పెంపు అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పంకు అనుగుణంగా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలలో కీలక బిల్లులు ప్రవేశపెడుతున్నారు.
ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ తప్పనిసరి. ఈ బిల్లులు ఆమోదం పొందితే లోక్సభ నియోజకవర్గాలు 543 నుండి 850కి పెరుగుతాయి. రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు కూడా గణనీయంగా విస్తరిస్తాయి. మహిళలకు దాదాపు 273 ఎంపీ స్థానాలు కేటాయింపబడతాయి. ఇది మహిళా సాధికారతకు, రాజకీయ ప్రాతినిధ్యానికి ఒక చారిత్రాత్మక అడుగుగా భావించవచ్చు.
పునర్వ్యవస్థీకరణపై భిన్నాభిప్రాయాలు..
మహిళా రిజర్వేషన్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉన్నా, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో ఏకాభిప్రాయం కొరవడింది. కాంగ్రెస్ నాయకులు పరస్పర విరుద్ధ వాదనలు చేస్తున్నారు. పాత జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం, సమాఖ్య స్ఫూర్తికి భంగం కలగవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్రం ప్రతిపాదించిన విధానం రాష్ట్రాల మధ్య సమతుల్యతను కాపాడే ప్రయత్నంగా కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి సూచించిన హైబ్రిడ్ విధానం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే అది కూడా దక్షిణాది రాష్ట్రాలకు గణనీయమైన ప్రయోజనం ఇవ్వదనే అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల కేంద్రం ప్రతిపాదించిన విధానం అనుసరణీయం అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఎన్డీయే కూటమికి లోక్సభలో 293, రాజ్యసభలో 121 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన సంఖ్యకు ఇంకా మద్దతు కావాలి. ఇతర పార్టీల సహకారంతో బిల్లు సులభంగా ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి.
నియోజకవర్గాలను పెంచడం వలన ప్రాతినిధ్యంలో ఉన్న అసమతుల్యతలు సరిచేయబడతాయి. అలాగే సమాజంలో సగ భాగమైన నారీ శక్తిని పాలనలో భాగం చేయడం ద్వారా దేశం **“వికసిత్ భారత్”**గా మారడంలో కీలక పాత్ర పోషించే అవకాశం మహిళలకు లభిస్తుంది. ఇది ఒక పరివర్తనాత్మక నిర్ణయంగా నిలిచే అవకాశముంది.
లింగమనేని శివరామ ప్రసాద్
7981320543
