Ntr | డ్రాగన్ తెర వెనుక ఏం జరుగుతోంది..?

Ntr | డ్రాగన్ తెర వెనుక ఏం జరుగుతోంది..?

Ntr | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం డ్రాగన్. ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అయితే.. అఫీషియల్ గా ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోయినా.. భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని.. వార్తలు వస్తుండడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. డ్రాగన్ తెర వెనుక ఏం జరుగుతోంది..?

కీలక పాత్రల్లో ఆలియా..?

ఎన్టీఆర్ అభిమానులకు సర్‌ప్రైజ్ న్యూస్ బయటకు వచ్చింది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా డ్రాగన్ పై ఆసక్తికరమైన అప్ డేట్ వినిపిస్తోంది. మేటర్ ఏంటంటే.. ఈ భారీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్స్ కూడా భాగమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, స్టార్ హీరో షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ మూవీలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి ఈ జోడీ స్క్రీన్‌ పై కనిపిస్తే.. అభిమానుల్లో మరింత ఎక్సైట్మెంట్ పెరగడం ఖాయం.

Ntr

విలన్ గా షాహిద్..?

ఇక షాహిద్ కపూర్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్‌లో మరింత బలపడనుంది. అతను నెగటివ్ లేదా కీలక పాత్రలో కనిపించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు ఈ కథను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ వార్ 2 మూవీ ప్లాప్ అయ్యింది. అందుచేత ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. ఈ కారణంగా ప్రశాంత్ నీల్ కథ పై మరింతగా కసరత్తు చేశాడట. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై మరింతగా క్రేజ్ రావడం కోసం.. ఆలియా, షాహిద్ కపూర్ లను రంగంలోకి దింపుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Ntr

మే 20న అప్ డేట్..?

ఈ డ్రాగన్ సినిమా ఇప్పటికే భారీ బడ్జెట్‌తో రూపొందుతుండగా, ప్రచారంలో ఉన్న ఈ కొత్త కాస్టింగ్ నిజమైతే సినిమా పై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి ఎన్టీఆర్, ఆలియా, షాహిద్ కాంబినేషన్ నిజంగా సెట్ అయితే.. ఇది పాన్ ఇండియా స్థాయిలో పెద్ద సెన్సేషన్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా అప్ డేట్ ఇవ్వనున్నారని తెలిసింది. మరి.. అప్పుడు ప్రచారంలో ఉన్న వార్తల పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Ntr
Ntr

Leave a Reply