డ్రగ్స్ నియంత్రణ, నిరోధాన్ని బాద్యతగా తీసుకోవాలి…

డ్రగ్స్ నియంత్రణ, నిరోధాన్ని బాద్యతగా తీసుకోవాలి…
డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి..
విజయవాడ, ఆంధ్రప్రభ : డ్రగ్స్ మహమ్మారి ని పారదోలడంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్తులు కావాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. పాతబస్తీలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ లో వన్ టౌన్ పోలీస్ చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో సుజనా చౌదరి పాల్గొన్నారు. అందులో భాగంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహంచారు.
ఈ సందర్బంగా సుజనా చౌదరి మాట్లాడుతూ గత 3 నెలల గా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో పోలీసు సిబ్బంది ద్వారా డ్రగ్స్ పై అవగాహన తీసుకు వచ్చేందుకు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావడం అభినందనీయమన్నారు. డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమంలో పోలీస్ లు, రాజకీయ నాయకులు కాకుండా ప్రజలు కూడా భాగస్తులు కావాలని పిలుపు నిచ్చారు. సుజనా ఫౌండేషన్ కి సమాచారం ఇవ్వండి.

లేదా పోలీసులకు చెప్పండి.. డ్రగ్ బారిన పడిన వారు పునరావాసం కోసం కృషి చేస్తాం.. హైస్కూల్ స్థాయి నుంచే డ్రగ్స్ నియంత్రణ, నిరోధానికి చర్యలు చేపట్టాలని అందుకు విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు. కేవలం డ్రగ్స్ బారిన పడిన వారిని గుర్తించి వారిని డీ అడిక్షన్ సెంటర్ లకు పంపడంతో పాటు డ్రగ్స్ నిరోధం, నియంత్రణ లో కూడా మార్పులు తేవచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా డ్రగ్స్ బారిన పడినట్లు తెలిస్తే సుజనా ఫౌండేషన్ కు గాని, పోలీసు లకు కాని తెలియ పర్చాలని కోరారు. సుజనా ఫౌండేషన్ ద్వారా కేవలం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికే కాకుండా ఎన్టీఆర్, క్రిష్ణా జిల్లాలలో సైతం డ్రగ్స్ నియంత్రణకు సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ విజయవాడ పోలీస్ చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ తో పాటు ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారం అద్భుతం అన్నారు.
డ్రగ్స్ పై దండయాత్ర మొదటి దశలో పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించామని, అలాగే ప్రస్తుతం 2.0లో అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇందులో పాజిటివ్ వచ్చిన వారిని డీ అడిక్షన్ సెంటర్లకు పంపడంతో పాటు వారికి పునరావాసం కల్పించే దిశగా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. నేరస్తులకు, అనుమానితులకు, డ్రగ్ డిటెక్షన్ కిట్ ల ద్వారా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో దండయాత్ర 3.0 కార్యక్రమం ప్రారంభించి ప్రతి కళాశాలలో ను పరీక్షలు చేయడం లక్ష్యం గా పెట్టామని ప్రకటించారు.
కార్యక్రమంలో వందలాది మంది అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అద్యక్షుడు సామినేని ఉదయభాను, బీజేపీ జిల్లా అద్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఏడీసీపీ గుణ్ణం రామక్రిష్ణ, ఏసీపీ దుర్గారావు, వన్ టౌన్ సీఐ గుణరామ్ తదితరులు పాల్గొన్నారు.
