యనమల రామకృష్ణుడిని పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు…

యనమల రామకృష్ణుడిని పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు…

విజయవాడ, ఆంధ్రప్రభ : మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ను రాజ్యసభ సభ్యుడు సాన Satish బాబు ఆదివారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన యనమల రామకృష్ణుడు వైద్యుల సూచన మేరకు స్టెంట్ వేయించుకున్నారు.

శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న ఆయనను ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసిన సానా సతీష్ బాబు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అందుతున్న వైద్య సేవలపై కూడా వివరాలు తెలుసుకున్నారు.

Leave a Reply