గ్రహణమొర్రి–అంగలిచీలిక చికిత్సలో ఆధునిక శస్త్రచికిత్సలపై అవగాహన…
సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో ప్రత్యేక శాస్త్రీయ సదస్సు
నాలుగు దంత వైద్య కళాశాలల అధ్యాపకులు, పీజీ విద్యార్థుల హాజరు
విజయవాడ, ఆంధ్రప్రభః స్థానిక డాక్టర్ సుధా–శ్రీ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో ఓరల్ అండ్ మ్యాక్సిల్లోఫేషియల్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో గ్రహణమొర్రి, అంగలిచీలిక వంటి పుట్టుకతో వచ్చే లోపాలపై శనివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి నాలుగు దంత వైద్య కళాశాలల అధ్యాపకులు, పీజీ వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
విభాగాధిపతి డాక్టర్ నాదెళ్ల వెంకటేశ్వరరావు అధ్యాపక బృందంతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. గుంటూరుకు చెందిన ప్రముఖ సర్జన్లు డాక్టర్ ఆనంద్ విజయ్, డాక్టర్ చంద్రబాబు, డాక్టర్ శ్రీకాంత్ ముఖ్య వక్తలుగా పాల్గొని గ్రహణమొర్రి, అంగలిచీలిక లోపాలకు అత్యాధునిక శస్త్రచికిత్స విధానాలు, శస్త్రచికిత్సల్లో పాటించాల్సిన మెళుకువలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు. వైద్య విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి దోహదపడేలా సదస్సును విజయవంతంగా నిర్వహించిన విభాగాధిపతి డాక్టర్ నాదెళ్ల వెంకటేశ్వరరావు, అధ్యాపక బృందాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ముల్పూరి రామోజీరావు, కార్యనిర్వహణాధికారి డాక్టర్ మధుసూధనరావు, కరస్పాండెంట్ పాలడుగు సాయిలు అభినందించారు.
