కనకదుర్గమ్మ అన్నదాన ట్రస్టుకు విరాళం
కనకదుర్గమ్మ అన్నదాన ట్రస్టుకు విరాళం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి పటమట ప్రాంతానికి చెందిన పాలకొండ తులసి రాంబాబు రమాదేవి దంపతులు శుక్రవారం అమ్మవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 1,01,116/-నగదును విరాళంగా అందజేశారు. దాత దంపతులకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి, అనంతరం వేదపండితులతో ఆశీర్వచనం చేయించారు. వారికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటాన్ని బహూకరించారు.
