ఇన్స్పైర్ ఐఐటీ, నీట్ అవార్డ్స్‌లో వికాస్ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ఇన్స్పైర్ ఐఐటీ & నీట్ ఫౌండేషన్ నిర్వహించిన స్టేట్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026లో తొర్రూరు పట్టణంలోని వికాస్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటినట్లు పాఠశాల కరస్పాండెంట్ రమేష్, ప్రిన్సిపాల్ వేణు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులై స్టేట్ టాపర్లుగా ఎంపికైన విద్యార్థులకు హన్మకొండలోని కాళోజీ క్షేత్రంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ చేతుల మీదుగా విద్యార్థులకు ప్రశంస పత్రాలు, షీల్డ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రమేష్, ప్రిన్సిపాల్ వేణు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
