asha bhosle| ఆశా భోస్లే కన్నుమూత

asha bhosle| ఆశా భోస్లే కన్నుమూత
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. ప్రముఖ లెజెండరీ నేపథ్య గాయని ఆశా భోస్లే (92) ఇవాళ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో శనివారం ఆసుపత్రిలో చేరారు. ఆమె ఎనిమిది దశాబ్దాలకు పైగా కెరీర్‌లో 12,500కి పైగా పాటలు పాడారు. ఆమె అంత్యక్రియలు ఏప్రిల్ 13న ముంబైలోని శివాజీ పార్కులో జరగనున్నాయి. ఆశా భోస్లే మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా.. మెలోడీలు, పెప్పీ సాంగ్స్, గజల్స్, భజనలు ఇలా ఏ ప్రక్రియలోనైనా తనదైన ముద్ర వేశారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది. ఆమె మృతి పట్ల ప్రధానమంత్రి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
