సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తోంది..

సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తోంది..
సమాజ సేవలో ముందుండాలి
అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
ధన్ పాల్ లక్ష్మీ బాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వ ర్యంలో అంబలి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే…
నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : సమాజ సేవా కార్య క్రమాలు చేపట్టడం ఎంతో సంతృప్తిస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారా యణ అన్నారు.సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలనిఎమ్మెల్యే కోరారు.ధన్ పాల్ లక్ష్మీ బాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువా రం నగరంలోని పీఎల్ ఎంఎస్ పెట్రోల్ బంక్ ఎదురుగా అంబలి కేం ద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరవాసుల సౌకర్యార్థం అంబలి పంపిణీ చేస్తున్నామ న్నారు. ఎండ దెబ్బ, వేడి నుంచి అంబలి ఉపశమనం కలిగిస్తుం దని పేర్కొన్నారు.
కేంద్రాన్ని గత 12 సంవ త్సరాలుగా కొనసాగిస్తు న్నారని, నాలుగేళ్లుగా తమ ట్రస్ట్ సహకరిస్తుం దని పేర్కొన్నారు. ప్రధా నంగా గ్రామీణులు అధిక సంఖ్యలో వస్తార ని, వారికి ఆసరాగా ఉంటుందనే ఉద్దేశ్యం తో అంబలి పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొ న్నారు. ఈకార్యక్ర మంలో అంబలి కేంద్ర ప్రతినిధి పార్శి రమేష్, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీ నారాయణ, బట్టు రాఘవేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, మల్కాయి మహేందర్, పవన్, మల్లేష్ యాదవ్, కల్పె అర్చన చిరంజీవి, ఎర్రం ప్రభాకర్, గజవాడ ఆగ మయ్య, మంచొల్ల రామస్వామి, రాజబా బు పాల్గొన్నారు.
