School | గదుల నిర్మాణానికి భూమి పూజ…

School | గదుల నిర్మాణానికి భూమి పూజ…
School | రుద్రూర్, ఆంధ్రప్రభ : రుద్రూర్ మండలం అంబం శివారు లోని మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలకు అవసరమైన అదనపు గదుల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. సంస్కార్ సొసైటీ కి సంబంధించిన స్థలంలో ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి పడుతున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో వర్ని తాసిల్దార్ సాయిలు రుద్రూర్ తాసిల్దార్ తారబాయి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గోపాల్, వర్ని సహకార సంఘం మాజీ అధ్యక్షుడు వీర్రాజు, రుద్రూర్ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పత్తి రాము తదితరులు పాల్గొన్నారు.
