అగ్ని ప్రమాద వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

బోధన్ రూరల్, ఆంధ్రప్రభ : అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిపించడానికి వీలుగా అగ్నిప్రమాద వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వారోత్సవాల పోస్టర్లను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు.

అగ్ని ప్రమాదాలు జరిగిన సమయాలలో స్పందించే విధానంపై ప్రజలకు అవగాహన కలిపించడంతో పాటు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారం పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలలో అగ్ని ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తారు. పోస్టర్ ఆవిష్కరణలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ చైర్మన్ పద్మావతి శరత్ రెడ్డి, సీఐ విజయ్ బాబు పట్టణ ఎస్ హెచ్ఓ వెంకట్ నారాయణ తదితరులు ఉన్నారు.

Leave a Reply