వెంకట దుర్గాంబాపురంలో మంత్రి కొల్లు రవీంద్ర..

వెంకట దుర్గాంబాపురంలో మంత్రి కొల్లు రవీంద్ర..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా బందరు మండలం వాడపాలెం పంచాయతీ వెంకట దుర్గాంబాపురంలో గురువారం మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించడం జరిగింది. రామాలయం సెంటర్ వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్‌లో గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా విని వినతులు స్వీకరించారు. గ్రామ ప్రధాన రహదారి అభివృద్ధికి 1.35 కోట్లు మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు వ్యక్తం చేసిన ఆనందం నాకు మరింత బాధ్యతను గుర్తు చేసిందన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించి, పిల్లల సౌకర్యాల పై అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. రేషన్ బియ్యం పొందడంలో ఇబ్బందులు ఉన్నాయని గ్రామస్తులు తెలియజేయగా, సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యత అని తెలిపారు.

Leave a Reply