బహదూర్ పేటలో వైద్య శిబిరం
బహదూర్ పేటలో వైద్య శిబిరం
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 6 వ వార్డు బహదూర్ పేటలో ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ ప్రారంభించారు. వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్ మల్లెల సరిత శ్రీకాంత్, వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
