క్యాన్సర్ బాధితుడు రాజును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

క్యాన్సర్ బాధితుడు రాజును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

యశోద ఆస్పత్రిలో ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చ

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన గంగాధర రాజు గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంగళవారం ఆస్పత్రికి వెళ్లి రాజును పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

రాజుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు.

Leave a Reply