మృతుని కుటుంబానికి గ్రామస్తుల చేయూత

మృతుని కుటుంబానికి గ్రామస్తుల చేయూత
రూ.53,500 నగదు,50 కిలోల బియ్యం అందజేత
మోత్కూర్, ఆంధ్రప్రభ : మండలంలోని అనాజీపురం లో ఇటీవల అనారోగ్యంతో అకాల మృతి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సహాయం, బియ్యం అందజేసి గ్రామస్తులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన నల్ల అంజయ్య మృతి చెందడంతో ఆ కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది.
దీంతో గ్రామస్తులు, యువకులు స్వచ్చందంగా సేకరించిన రూ.53,500తో పాటు 50 కిలోల బియ్యాన్ని ఆ కుటుంబానికి మంగళవారం స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా తమకు ఆర్ధిక సహాయం అందించిన గ్రామస్తులకు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు తదితరులు ఉన్నారు.
