ఎన్ఎస్ఎస్ శిభిరంలో బాగంగా సామాజిక సేవపై దృష్టి సారించాలి
ఎన్ఎస్ఎస్ శిభిరంలో బాగంగా సామాజిక సేవపై దృష్టి సారించాలి
ఎస్ఆర్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రవీందర్
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలతో పాటు సామాజిక సేవపై దృష్టి సారించాలని ఎస్ఆర్ అసోసియేట్ ఫిజికల్ డైరెక్టర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కొప్పుల రవీందర్ సూచించారు. ఎస్ఆర్ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్, వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో వ్యర్థ నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈమేరకు విద్యార్థులకు వ్యర్థాల సరైన నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ,సుస్థిర జీవన విధానాల ప్రాముఖ్యతను వివరించారు.
వ్యర్థాల వర్గీకరణ, రీసైక్లింగ్ విధానాలు, కంపోస్టింగ్ పద్ధతులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరంపై అవగాహనను పెంపొందించారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రవీందర్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. విద్యార్థులకు మార్గనిర్దేశనం చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. యువత సమాజంలో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు.
ఈకార్యక్రమంలో వాలంటీర్లు చురుకుగా పాల్గొని వ్యర్థ నిర్వహణకు సంబంధించిన ప్రాయోగిక పద్ధతులను ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులు వ్యర్థాల సరైన నిర్వహణ పాటిస్తూ సమాజంలో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
