బాబు జగ్జీవన్ రామ్ సేవలు అమోఘం

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రావ్ సేవలు అమోఘమని ఏఎంసీ మాజీ చైర్మన్,జుక్కల్ సర్పంచ్ భర్త కే.సాయగౌడ్ అన్నారు.డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారంనాడు జుక్కల్ గ్రామపంచాయతిలో వార్డు సభ్యులు,గ్రామస్తులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

ఉప ప్రధానిగా,సంఘసంస్కర్తగా ఉన్నా జగ్జీవన్ రామ్ దళితులతో పాటు,పేద, బడుగు,బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని,సామాజిక న్యాయం,సమానత్వం, హక్కుల సాధన కోసం పోరాడిన యోధుడు బాబు జగ్జివన్ రామ్ అని ఆయన ఆన్నారు.బాబుజిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్ రాజుసర్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.