ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆధునిక గుండె వైద్య సేవలు..

నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆసుపత్రిలో తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సింకోపల్ అటాక్స్‌తో బాధపడుతున్న యాదయ్యకు శనివారం ఉదయం,ఈ యాంజియోగ్రామ్ నిర్వహించినట్లు ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డా.నాగ మోహన్ రావు తెలిపారు. కార్డియాలజీ విభాగం వైద్యులు మరియు ఇతర వైద్య సిబ్బంది సమిష్టి కృషితో ఈ ప్రక్రియ విజయవంతమైందన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆధునిక గుండె వైద్య సేవలు అందుబాటులోకి రావడం జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇలాంటి పరీక్షలు,చికిత్సల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు లేదా హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ సేవలు అందడం ప్రజలకు ఆర్థిక భారం తగ్గించే అంశమని వైద్యులు తెలిపారు.ప్రజలకు నాణ్యమైన మరియు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిరంతరం కృషి చేస్తోందని డా. నాగ మోహన్ రావు వెల్లడించారు.

Leave a Reply