ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు
ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు
బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ హార్షాధికాలు
విజయవాడ ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందటంతో విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. గురువారం సాయంత్రం ఎన్టీఆర్ భవన్ వద్ద బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ టీడీపీ శ్రేణులు సంతోష సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించి జయహో అమరావతి అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్ మాట్లాడుతూ…. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత ఒక చారిత్రాత్మక ఘట్టం అన్నారు. అమరావతి రాజధానిగా ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల వల్ల అమరావతి ప్రపంచ స్థాయి రాజధానులలో నంబర్ వన్ రాజధానిగా అమరావతి మారుతోందని చెప్పారు. రైతుల పోరాటం మరియు కష్టాలు … అమరావతి నిర్మాణంలో దాగి ఉన్నాయన్నారు.

గత ప్రభుత్వ పాలనలో రైతులు దాదాపు 1600 రోజులకు పైగా సుదీర్ఘ పాదయాత్ర (అమరావతి నుండి తిరుపతి) చేసి అమరావతిని కాపాడుకున్నారన్నారు. రైతన్నలు లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు సైతం లెక్క చేయక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతికి పూర్వవైభవం వచ్చిందనీ, అమరావతి రాజధాని నిర్మాణం చరవేగంగా జరుగుతుందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అమరావతికి చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారని అన్నారు.

ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిందన్నారు. అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, రైతులు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. అమరావతి ప్రాంతంలోని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంట్‌లో ఈ బిల్లు ఆమోదంకి పూర్తి మద్దతు కోసం విశేష కృషి చేశారన్నారు. ఎంపీ కేశినేని చిన్నితో అమరావతి బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుగు ప్రజల పక్షాన తెలుపుతున్నట్లు భవ కుమార్ తెలిపారు.
తెలుగు ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే నేటికీ వైసీపీ అమరావతిపై విషం కక్కుతూనే ఉందన్నారు. నగరపాలక సంస్థ టిడిపి మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ…అమరావతి చట్టబద్ధతకు కృషిచేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నేత నారా లోకేష్ , బీజేపీ నేత అమిత్ షా తదితర నాయకులకు తెలుగు ప్రజలంతా ధన్యవాదాలు తెలుపుతున్నారు అన్నారు. టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం మాట్లాడుతూ… పార్లమెంటులో బిల్లు సమయంలో అమరావతి చరిత్ర ఎంపీల నోటి వెంట వింటుంటే తెలుగు జాతి ఘన చరిత్ర ఎంత ఘనమైందో ప్రపంచానికి మరోసారి తెలిసిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఇకపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో… ఉడా మాజీ చైర్మన్ తూమాటి ప్రేమ్ నాథ్, మాజీ కార్పొరేటర్ లు దేవినేని అపర్ణ, చెన్నుపాటి ఉషారాణి, జాస్తి సాంబశివరావు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, మార్కెట్ యార్డు కమిటీ ఉపాధ్యక్షులు పాల మాధవ, మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైజాన్, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు ఇర్ఫాన్, టీడీపీ జిల్లా కార్యదర్శి పిళ్ళ శ్రీనివాస రావు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసపోగు రాజేష్, లీగల్ సెల్ నాయకులు ఎర్నేని వేదవ్యాస్, శాప్ డైరెక్టర్ సంతోష్, గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, ఎన్ఐఆర్ డి అర్బన్ కోఆర్డినేటర్ నరసింహ చౌదరి, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి ఆనంద్ స్వరూపు, టి ఎన్ టి యు సి జిల్లా కార్యదర్శి కోడూరు ఆంజనేయ వాసు, పార్టీ సీనియర్ నాయకులు కొల్లి శ్రీనుబాబు, కోనేరు కిషోర్ బాబు, పెద్ద సంఖ్యలో మహిళ కార్యకర్తలు, నాయకులు, విజయవాడ అర్బన్ లోని వివిధ డివిజన్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.

