ఎన్‌టీఆర్ భరోసాతో పేదలకు సామాజిక భద్రత

ఎన్‌టీఆర్ భరోసాతో పేదలకు సామాజిక భద్రత
జిల్లాలో 2,26,775 మందికి రూ. 98.45 కోట్ల పంపిణీ
పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆంధ్రప్రభ, విజయవాడ : ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా పేదలకు సామాజిక భద్రత లభిస్తోందని.. జిల్లాలో 2,26,775 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 98.45 కోట్ల మేర పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ బుధవారం విజయవాడ అర్బన్ పరిధిలోని సీతన్నపేట ప్రాంతంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఇంటివద్దే పెన్షన్లు అందిస్తున్న తీరును పరిశీలించారు. వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా, సమర్థవంతంగా జరుగుతోందని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ సామాజిక భద్రత పథకాలు పేదల జీవనోపాధికి బలంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సామాజిక భద్రత పెన్షన్లు వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు తదితరులకు ఆర్థిక స్థిరత్వం, గౌరవప్రదమైన జీవనం, ఆరోగ్య సంరక్షణను అందిస్తాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
