ఏకా – ది వ‌న్ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న అద‌ర‌హో..

ఏకా – ది వ‌న్ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న అద‌ర‌హో..

ప్ర‌తి స్వ‌రూపం విశిష్ట స్త్రీ శ‌క్తికి ప్ర‌తిరూపం
ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించిన క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

ఆంధ్రప్రభ, విజయవాడ : సాంస్కృతిక వార‌స‌త్వానికి ప్రోత్సాహ‌మిస్తూ ఏకా- ది వ‌న్ పేరుతో ఏర్పాటుచేసిన జాతీయ‌స్థాయి సంచార చిత్ర ప్ర‌ద‌ర్శ‌న అద్భుత‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ప్ర‌శంసించారు. విజ‌య‌వాడ ఎంజీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటుచేసిన ఏకా – ది వన్ జాతీయ స్థాయి సంచార చిత్ర ప్రదర్శనను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ బుధ‌వారం రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సమితి ఛైర్‌ప‌ర్స‌న్ తేజస్వి పొడపాటితో క‌లిసి తిల‌కించారు.

ప్రముఖ కళాకారిణి డాక్టర్ బీనా ఉన్నికృష్ణన్ రూపొందించిన 64 యోగిని చిత్రాలను ఆసక్తిగా ప‌రిశీలించి.. వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకొని అభినంద‌న‌లు తెలిపారు. దేశ ఆధ్యాత్మిక సంప్ర‌దాయ ఔన్న‌త్యాన్ని నేటి తరానికి పరిచయం చేసేలా ఈ ప్రదర్శన ఉందని కొనియాడారు. ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని నేటి సామాజిక సంభాషణ లోకి తీసుకువచ్చే ఒక సమకాలీన కళాత్మక వివరణగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు. ఇంత మంచి ప్ర‌ద‌ర్శ‌న‌ను ఏర్పాటుచేసిన ప్ర‌తిఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు తెలిపారు.

Leave a Reply