Icon Star | అసలు ప్లాన్..

Icon Star | అసలు ప్లాన్..
Icon Star | డిఫరెంట్ గెటప్స్ లో బన్నీ
బర్త్ డే అప్ డేట్ పై సస్పెన్స్
టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్
సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మక ప్లాన్
Icon Star | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ క్రేజీ కాంబోలో భారీ, క్రేజీ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా అప్ డేట్స్ కోసం బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే. ఆ రోజున ఈ సినిమాకి (Movie) సంబంధించిన అప్ డేట్ వస్తుందని.. గత కొన్ని రోజులుగా వార్తలు వస్తుండడంతో.. ఎలాంటి అప్ డేట్ ఇవ్వనున్నారనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు.. అసలు విషయం బయటకు వచ్చింది. ఇంతకీ.. బన్నీ పుట్టినరోజున ఎలాంటి అప్ డేట్ ఇవ్వబోతున్నారు..?

Icon Star | డిఫరెంట్ గెటప్స్ లో బన్నీ..
ఈ భారీ క్రేజీ మూవీలో.. అల్లు అర్జున్ ఇంత వరుకు చూడని పాత్రలో కనిపించబోతున్నాడని.. వార్తలు వచ్చాయి. అంతే కాకుండా.. బన్నీ.. ఒకటి కాదు రెండు కాదు అంతకు మించిన పాత్రల్లో కనిపిస్తాడని కూడా ప్రచారం జరిగింది. దీంతో అసలు కథ ఏంటి..? సినిమా ఎలా ఉండబోతుంది..? అనేది రోజురోజుకు మరింతగా క్రేజ్ పెరుగుతుంది. ఇదిలా ఉంటే.. బన్నీ పుట్టినరోజు (Bunny Birthday) దగ్గర పడుతున్న కొద్దీ.. ఈ రోజు గ్లింప్స్ రిలీజ్ చేస్తారని.. టైటిల్ అనౌన్స్ చే్స్తారని. ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో బన్నీ బర్త్ డేకి ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ ఇవ్వనున్నాడు అనేది సస్పెన్స్ గా మారింది.

Icon Star | టైటిల్ అండ్ పోస్టర్ మాత్రమే..
ఇదిలా ఉంటే.. ఈ సస్పెన్స్ కి తెర పడింది. బన్నీకి అత్యంత ఆప్తుడు, బన్నీ వాస్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అసలు విషయం బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. బన్నీ బర్త్ డేకి ఎలాంటి వీడియో కంటెంట్ రిలీజ్ చేసే ఆలోచనలో చిత్రయూనిట్ లేదు. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే వస్తాయి. ఎటువంటి వీడియో కంటెంట్.. గ్లింప్స్ రిలీజ్ చేయడం లేదు అని బన్నీ వాసు (Bunny Vasu) చెప్పారు. ఈ సినిమా చాలా కీలకమైంది. కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అందుకనే చాలా కేర్ తీసుకుంటుందట. టైటిల్ అండ్ పోస్టర్ తోనే మరింతగా హైప్ క్రియేట్ చేసి ఆతర్వాత వీడియో రిలీజ్ చేయాలనేది ప్లాన్ అని సమాచారం. సో.. బన్నీ మూవీకి సంబంధించి విజువల్స్ చూడాలంటే.. మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

