today gold rate| మ‌ళ్లీ పెరుగుతున్న ధ‌ర‌లు

today gold rate| మ‌ళ్లీ పెరుగుతున్న ధ‌ర‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా దాడులు బంగారం ధ‌ర‌ల‌పై ఎఫెక్ట్ చూపుతున్నాయి. యుద్ధం జ‌రిగిన రోజుల్లో బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఎప్పుడైతే వార్‌కు బ్రేక్ ప‌డిందో అప్ప‌టి నుంచి గోల్డ్ ధ‌ర‌ పెర‌గ‌డం మొద‌లైంది. గ‌త నెల రోజులుగా పెద్దగా పెరగని బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ పైకి ఎగ‌బాకుతున్నాయి. యుద్దం ప్రారంభమైనప్పుడు గరిష్టం నుంచి రూ.30 వేలకుపైగా బంగారం ధ‌ర పడిపోయింది. అయితే డాలర్ పుంజుకోవడంతో ధరలు దిగొచ్చాయి. ఇప్పుడు మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. ధ‌ర పెరుగుతుండ‌టంతో ఆందోళ‌న చెందుతున్నారు.

మార్చి 31(మంగ‌ళ‌వారం)న బంగారం రేట్లు స్వల్పంగా పెరిగాయి. మార్చి 30 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.103 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 929గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 685గా కొనసాగుతోంది.

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 31, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. అయితే రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 50వేల వద్ద స్థిరంగా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.250గా ఉంది.

Leave a Reply