కాపాడిన ఫైర్ ఫైటర్

  • మోపిదేవిలో తప్పిన పెను ప్రమాదం

మోపిదేవి, ఆంధ్రప్రభ : గ్యాస్ బండ లీకేజీతో భారీగా మంటలు వ్యాపించి తృటిలో పెను ప్రమాదం తప్పిన సంఘటన అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి గ్రామ ప్రధాన కూడలి వద్ద గురువారం రాత్రి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన కూడలి వద్ద ఉన్న హోటల్లో గ్యాస్ బండ లీకై ఒకసారిగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో హోటల్లో టిఫిన్ చేస్తున్న వ్యక్తులు మంటలను చూసి పరుగులు తీశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి అతి చేరువలో హోటల్ ఉండడం, దేవస్థానానికి విచ్చేసిన భక్తులు సైతం కొద్దిసేపు ఆందోళనకు లోనయ్యారు.

మచిలీపట్నం అగ్నిమాపక కేంద్రంలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ స్వగ్రామం అవనిగడ్డకు చెందిన సుధీర్ అనే వ్యక్తి ఆ సమయంలో కారులో వెళుతుండగా ప్రధాన కూడలిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీను ఆ వ్యక్తిని గమనించి సమాచారం ఇచ్చారు. వెంటనే సుధీర్ చాకచక్యంతో గ్యాస్ బండ వద్దకు వెళ్లి మంటలను అదుపు చేసే ప్రయత్నంలో దేవస్థానంలో ఉన్న అగ్నిమాపక యంత్రాల సహాయం మంటలను పూర్తిగా అదుపు చేయడం జరిగింది. భక్తులు, ప్రజలు పెను ప్రమాదం తప్పిందనిఊపిరి పీల్చుకున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం తో అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి విచ్చేసి మంటలను పూర్తిగా అదుపు చేశారు.

Leave a Reply