Corruption | రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదు…

Corruption | రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదు…

Corruption | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం పై కాంగ్రెస్ ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని బండి సంజయ్ విమర్శించారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మేము అన్నామని బహిరంగంగా చెప్పామని గుర్తు చేశారు. కానీ కాళేశ్వరం మొత్తం కుంభకోణం అని ఆరోపించిన కాంగ్రెస్, ఇప్పుడు మూడు బ్యారేజీల్లో మాత్రమే అవినీతి జరిగిందని అంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం విచారణపై రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మీకు సాధ్యం కాకపోతే చెప్పండి, మేము మా ప్రభుత్వం చూసుకుంటుందని కేంద్రమంత్రి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒక్కటేనని కేంద్రమంత్రి ఆరోపించారు. కాళేశ్వరంలో కేసులో హరీష్ ​రావు ఇరుక్కుంటాడని, ఫార్ములా ఈ రేస్ కేసు రేవంత్ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య డీల్ కుదిరింది, అందుకే రేవంత్ హరీష్ ​రావును మాత్రమే టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. హరీష్ ​రావు జాగ్రత్తగా ఉండాలని కేంద్రమంత్రి బండి సంజయ్ సూచించారు. అసెంబ్లీలో కౌశిక్‌రెడ్డి వ్యహరించిన తీరు సరైనది కాదని స్పష్టం చేశారు. ఎథిక్స్ కమిటీ లేదని, అసెంబ్లీ కమిటీలే లేవని అన్నారు. లేని కమిటీకి కౌశిక్‌రెడ్డి అంశం రికమాండ్ చేయడం ఏంటని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.