RoyalEnfieldGuerrilla450Apex|బుల్లెట్లో న్యూ మోడల్

RoyalEnfieldGuerrilla450Apex|బుల్లెట్లో న్యూ మోడల్
RoyalEnfieldGuerrilla450Apex |రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అంటే యువతకు పిచ్చి క్రేజ్
దీనిని వినియోగించడం ఒక స్టేటస్ సింబల్
ఇతర బైకులతో పోలిస్తే డిఫరెంట్ స్టైల్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నీ బుల్లెట్ బండి ఎక్కేసి వచ్చేత్తాపా.. అని తెలుగు సినిమాలోని పాట. ప్రస్తుతం బుల్లెట్ బండికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అంటే యువతకు పిచ్చి క్రేజ్. యూత్ ఈ బండిని కొనడమే తన డ్రీమ్ అని చెప్పే అంత స్థాయి దీనిది. దాని గంభీరమైన సౌండ్, క్లాసిక్ డిజైన్, పవర్ఫుల్ పికప్ ఓ రేంజ్లో ఉంటుంది. దీనిని వినియోగించడం ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. ఇతర బైకులతో పోలిస్తే డిఫరెంట్ స్టైల్ కలిగిన ఉండటం ఈ వాహన ప్రత్యేకత. యూత్యే కాదు. మధ్య వయస్సు వారు కూడా దీనికి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ప్రముఖ భారతీయ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది.
RoyalEnfieldGuerrilla450Apex | గెరిల్లా 450కు కొత్త టాప్ వేరియంట్

ఈ సంస్థ నూతన బైక్‌ను విడుదల చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ తన గెరిల్లా 450 లైనప్‌లో కొత్త ‘అపెక్స్’ వేరియంట్‌ను రూ. 2.49 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ తన గెరిల్లా రోడ్‌స్టర్ సిరీస్‌కు 2026లో సరికొత్త అప్డేట్ను అందించింది. ఇందులో భాగంగా గెరిల్లా 450కు కొత్త టాప్ వేరియంట్‌గా ‘ఏపెక్స్’ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ బైక్‌కు మెరుగైన టైర్లు, మార్చిన రైడింగ్ పొజిషన్‌తో ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించింది. 2026 గెరిల్లా 450 ఏపెక్స్, సాధారణ గెరిల్లా 450తో పాటు మార్కెట్లో విక్రయాలకు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు వేరియంట్లు కూడా మూడు ట్రిమ్‌లలో లభించనున్నాయి. ‘ఏపెక్స్’ అనే పేరుకు తగ్గట్టుగానే ఈ వేరియంట్ మరింత ఆగ్రెసివ్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. గెరిల్లా 450లో ముందు, వెనుక రెండింటిలోనూ 17 అంగుళాల చక్రాలు ఉండగా.. ఏపెక్స్ వేరియంట్లో వీరెడెస్టీన్ సెంట్యూరో ఎస్టీ రోడ్ టైర్లను అమర్చారు.
ఇందులో అదే పవర్ఫుల్ 452 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 40 PS పవర్, 40 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ వంటి ఫీచర్లు రైడింగ్‌ను సులభతరం చేస్తాయి. షోవా బిగ్-పిస్టన్ సస్పెన్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ భద్రతను పెంచుతాయి. రౌండ్ కలర్ టీఎఫ్టీ (TFT) డిస్ప్లేలో నావిగేషన్, కనెక్టివిటీ ఫీచర్లు అప్డేట్ అయ్యాయి. పాత హిమాలయన్, గెరిల్లా యజమానులు ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్ ద్వారా ఈ కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లను పొందవచ్చు.
