ఖమ్మం : రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి చెందిన సంఘటన గురువారం ఖమ్మం నగరంలో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం మేరకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని దుబ్బ తండ గ్రామానికి చెందిన సర్పంచ్ అజ్మీరా బాల్య తన కొడుకు అజ్మీర్ ఆ సాయికుమార్ ని ద్విచక్రవాహనం పై ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వైరా రోడ్డు నుంచి వెళుతున్నారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో వారిద్దరూ లారీ టైర్ కింద పడడంతో మృతి చెందారు. సాయి కుమార్ ఖమ్మం నగరంలోని కృష్ణవేణి కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KHM | రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి..
