సాగునీరు, ట్రాఫిక్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన

సాగునీరు, ట్రాఫిక్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన

పంటల రక్షణకు వెంటనే నీరు విడుదల చేయాలి
ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు విజ్ఞప్తి

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : సాగునీరు, ట్రాఫిక్ సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. నియోజకవర్గంలోని శాయంపేట మండలంలోని గోవిందాపూర్, పెద్దకోడపాక గ్రామాల్లో సాగునీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకునేందుకు వెంటనే నీటిని విడుదల చేసి పంట పొలాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.


అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇసుక, బొగ్గు, బూడిద లారీల రవాణా అధికంగా ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో ఇప్పటికే పోలీస్ స్టేషన్ మంజూరైనప్పటికీ భవనం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. దీనికి నూతన భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply